నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం

– సిఫార్సు కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
– ముఖ్యమంత్రితో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీపై మాట్లాడిన ఎమ్మెల్యే
– మెదక్ జిల్లాలోని రైతాంగానికి త్వరలోనే తీపికబురు
– మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

మెదక్ జిల్లాలోని నిజాంషుగర్స్ చక్కెర కర్మాగారంను త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పునప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాం షుగర్స్ పునప్రారంభ విషయమై నియోజక వర్గ ఎమ్మెల్యే గా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు కమిటీలో మెంబర్ గా చేర్చుకుందని తెలియజేశారు. మెదక్ జిల్లాలోని రైతాంగానికి త్వరలోనే మంచిరోజులు రానున్నాయని, ఎన్నో టన్నుల చెరుకును పండించే మెదక్ జిల్లా రైతాంగానికి ప్రత్యేక రాష్ర్టంలో ఆకలిచావులకు బిఆర్ఎస్ ప్రభుత్వం కారణం అయ్యిందని ఆయన మండిపడ్డారు. ప్రత్యక్షంగా 400 మంది, పరోక్షంగా 1100 మంది ఉద్యోగులు మెదక్ మంబోజిపల్లి చక్కెర కర్మాగారంలో పనిచేశారని ఆయన గుర్తుచేశారు. చక్కెర కర్మాగారం ను మూసివేసిన రోజు నుండి నేటి వరకు అక్కడి ఉద్యోగులు, చెరుకు పండించే రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం అని ఆయన తెలిపారు. త్వరలోనే మెదక్ జిల్లా రైతాంగానికి తీపికబురు తెలియజేస్తానని ఆయన హామినిచ్చారు. నిజాం షుగర్స్ పునప్రారంభ సిఫారసు కమిటీ చైర్మెన్ మెంబర్ గా నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహత్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

హర్షం వ్యక్తం చేసిన జిల్లా రైతాంగం
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పై నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించడమే కాకుండా పునప్రారంభం పై సిఫారసు కమిటీని ఏర్పాటు చేసి అందులో కమిటీ మెంబర్ గా ఎమ్మెల్యే ఉండడం ఇక్కడి రైతాంగానికి ఎంతో ఉపయోగకరం అని, త్వరలోనే నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking