వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి

వికలాంగుల్లో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రలు ఏర్పాటు చేయాలి

NPRD క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పఠాన్ ఉమర్ ఖాన్

యం. అడివయ్య రాష్ట్ర కార్యదర్శి

సంగారెడ్డి జనవరి 11: ప్రజ బలం ప్రతినిది:వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల అధినేత పఠాన్ ఉమర్ ఖాన్అన్నారు
ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2024 క్యాలెండర్ ను హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఆయన ఆవిష్కరణ చేశారు
*ఈ సందర్భంగా పఠాన్ ఉమర్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలను అమలు చేయాలని కోరారు.వికలాంగులు సమాజంలో వివక్షతకు, చిన్న చూపుకు గురవుతున్నారని వారిలో మనోధైర్యం కల్పించవలసిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. వికలాంగులలో అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు.2024 నూతన సంవత్సరం ఎన్పీఆర్డి ముద్రించడం అభినందననీయమని, సమస్యలపై పోరాడుతూనే వికలాంగులను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. 21 రకాల వైకల్యాల ప్రత్యేక రోజులుక్యాలెండర్ లో ముద్రించడం ద్వారా వికలాంగుల పట్ల సమాజంలో మరింత అవగాహన కలుగుతుందని అన్నారు.మూగ, చెవిటి, మానసిక వికలాంగులు అయినా పిల్లలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేయాలని కోరారు.
NPRD రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ వికలాంగులను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. వికలాంగులకు నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వికలాంగులలో దాగి ఉన్న శక్తి సామర్థ్యలు బయటకు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ విద్య సంస్థలలో విద్యార్థులకు, ప్రభుత్వ అధికారులకు 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహనా కల్పించాలని డిమాండ్ చేశారు. క్యాలెండర్ ముద్రనకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో హెలెన్ కెల్లార్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అర్ముఘం, హెలెన్ కెల్లార్ రెహబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ యం శశిధర్ రెడ్డి, సిబ్బంది గౌస్, NPRD రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాగలక్ష్మి, నాయకులు అమరావతి, చంద్రశేఖర్,అనిల్ లతో పాటు విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking