ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పటిష్ట పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు
నాణ్యమైన మద్దతు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
కలెక్టర్
రైతులు దళారులు నమ్మి మోసపోవద్దు
వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
ఖరీఫ్ జిల్లా వ్యాప్తంగా 387 కొనుగోలు కేంద్రాలు
ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి
క్వింటాలకు గ్రేడ్ ఏ రకానికి రూ.2320
క్వింటాలకు సాధారణ రకానికి రూ.2300
కొనుగోలు కేంద్రాల సమస్యలను పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు 9281103685
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని
అధికారులను ఆదేశించినా
కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం
1.10.2024:
మంగళవారం ఖరీఫ్ సీజన్ (2024-25) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు , వివో లు, టీఎస్ సీఎస్ చైర్మన్లు, సి ఈ ఓ లు, రైస్ మిల్లర్స్ మండల అధ్యక్షులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ ఆదేశాల అనుసరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్స్, ఐకెపి, మార్కెటింగ్, శాఖల ద్వారా 387 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఐకెపి ద్వారా (101 ) కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్స్ ద్వారా (267) , డిఎం సివిల్ సప్లై (07) FPO-(12) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు
జిల్లాలో సన్న రకం 44,534 హెక్టార్లలో సాగు చేసినట్లు,57,432 హెక్టార్లలో దొడ్డు రకం సాగు చేసినట్లు చెప్పారు .
జిల్లాలో 04 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు వచ్చే అవకాశం
ఉందని చెప్పారు.
అక్టోబర్ మూడో వారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు
01 లక్ష గన్ని బ్యాగ్స్ అవసరం ఉంటాయని వివరించారు.
109 రైస్ మిల్లులకు గాను 66 మిల్లులను బ్లాక్లిస్టులో పెట్టడం జరిగిందని
జిల్లాలో 43 మిల్లులకు మాత్రమే 01 లక్ష 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు వస్తుందని అంచనా వేశామన్నారు. ఇతర జిల్లాలకు 02 లక్షల 54 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించడం జరుగుతుందన్నారు.
రవాణా సంబంధించిన విషయంలో సరిపడ వాహనాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు
రైతులు కాయకష్టం చేసి అహర్నిశలు కష్టపడి వరి పంటను పండిస్తారని, రైతుకు భరోసా కల్పిస్తూ మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, అన్నారు
ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు.
నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.
రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూకేంద్రాలకు తరలించాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320 సాదారణ రకానికి రూ.2300 నిర్ణయించినందని వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డి ఎం సివిల్ సప్లై హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, డిసిఒ కరుణ, మార్కెటింగ్, రవాణా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు