ఘనంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జన్మదిన వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 11

జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదినోత్సవ వేడుకలను జమ్మికుంట పట్టణం అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు జమ్మికుంట గాంధీ చౌక్ లో కేక్ కటింగ్ చేసి కొత్తపల్లి స్పందన అనాధ ఆశ్రమం లో పండ్ల పంపిణీ చేశారు అనంతరం ఆభాది జమ్మికుంట ZPHS లో పండ్ల పంపిణీ చేశారు. బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మలేష్ జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా నుండి కో-ఆపరేటర్ డైరెక్టర్ గా కరీంనగర్ కార్పొరేటర్ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగారు బండి సంజయ్ కుమార్ ఆ మహాశక్తి అమ్మవారి దీవెనలు ఎల్లవేళల ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో భోగభాగాలతో రానున్న రోజులలో ఇంకా ఉన్నంత స్థానంలో ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్,కోరే రవీందర్,పల్లపు రవి ఠాగూర్, రాజేష్,మోతే స్వామి, కైలాస కోటి గణేష్ కొమ్ము అశోక్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking