త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ
ముస్లీం మైనారిటీ సంఘం మండల అధ్యక్షుడు షాహిద్ ఆలీ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 17 : త్యాగానికి ప్రతీకగా బక్రీద్(ఈద్-ఉల్-అధ) పండుగ అని ముస్లీం మైనారిటీ సంఘం మండల అధ్యక్షుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాహిద్ ఆలీ పేర్కొన్నారు.సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుండి ఈద్గాలు,మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పరస్పరం అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రతి మనిషి తన జీవితంలో మంచి మాత్రమే చేయాలన్నారు. అనంతరం తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు.మత పెద్దలు మౌలానా ఇఫ్తిఖర్ ప్రార్థనలు చేయించి బక్రీద్(ఈద్-ఉల్-అథా) ప్రాముఖ్యత గురించి వివరించారు.బక్రీద్ పండుగ పురస్కరించుకొని సీఐ నరేందర్, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆరిఫ్,చాంద్ భాయ్, అబ్బు భాయ్,సజ్జు,అన్వర్, ఖాన్,నవాబ్ ఖాన్,ఇలియాస్ ఖాన్,బాబా,కలీం,ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.