తూప్రాన్ సాయిబాబా సంస్థాన్ మందిరంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు. ఎండ్రేల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో మహా అన్నదానం.

 

మెదక్ తూప్రాన్ డిసెంబర్ 26 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో సాయిబాబా సంస్థాన్ మందిరం దేవాలయంలో భారతీయ రిపబ్లికన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ హైకోర్టు న్యాయవాదులు సాయిబాబా మందిరం నిర్వాహకులు ఎండ్రేల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో దత్త జయంతి మహోత్సవం ఘనంగా జరిగాయి.
ఉదయాన్నే నగర సంకీర్తన ప్రభాతభేరి, కాకడ హారతి, మహాభిషేకం, అష్టోత్తర పూజ, మహా గణపతి పూజ , గురు దత్తాత్రేయ పాదుకపూజ, సాయిబాబా పూజ, హారతి, మహా అన్నదానం భజన సంకీర్తనలు భక్తుల మధ్య తూప్రాన్ పట్టణంలో దైవభక్తి సంకీర్తనలతో మారు మ్రోగాయి.
ఈ సందర్భంగా సీనియర్ హైకోర్టు న్యాయవాదులు
బి ఆర్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తూప్రాన్ సాయిబాబా మందిరం నిర్వాహకులు డాక్టర్ ఎనరేల్లి వెంకటస్వామి దంపతులు సాయిబాబా మందిరంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించి , దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవ మనుగడకు , దైవ భక్తి చాలా అవసరమని, దైవభక్తి వల్ల ప్రజలకు మంచి లక్షణాలు వస్తాయని, దైవభక్తి కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకు అన్నదానం చేస్తే మహా పుణ్యం వస్తుందని, అలాగే మాకు సంతోషాన్నిస్తుందని , మాకు సాధ్యమైనంతవరకు పేదలకు సేవ చేస్తానని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలను ప్రజల సద్వినియోగపరచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయని. భారతీయ రిపబ్లికన్ అండ్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి సంక్షేమ పథకాలు పగడ్బందీగా అమలు అయ్యేటట్టు చూస్తారని , మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించే విధంగా ప్రభుత్వ అధికారులను సమన్వయం చేశారని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ ముదిరాజ్, పోతురాజు నాగరాజు, సాయిబాబా భక్తబృందం సభ్యులు , ప్రజా ప్రతినిధులు భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking