ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 11 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని లిటిల్ స్టార్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలలో భాగంగా భోగి మంటలు,బొమ్మల కొలువు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పండుగల యొక్క విశిష్టత తెలుస్తుంది అలాగే వాతావరణానికి అనుగుణంగా వారి అలవాట్లను మార్చుకోవడానికి ఉపయోగపడతాయి.సంక్రాంతి అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి.సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు.సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి,రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ.కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు.ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో,రెండవ రోజు పొంగలి, పిండివంటలతో,పితృ దేవతల,దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గోపూజలతో పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్, మినుముల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.