ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16 : జిల్లాలో జిలఈ నెల 15, 16 తేదీలలో జరిగిన గ్రూప్-2 పరీక్షలు అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ నెల 15న జరిగిన పరీక్షకు 14 వేల 951 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ఉదయం పరీక్షకు 7 వేల 446 మంది అభ్యర్థులు, సాయంత్రం పరీక్షకు 7 వేల 363 మంది అభ్యర్థులు హాజరయ్యారని,ఈ నెల 16న జరిగిన పరీక్షకు 14 వేల 951 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ఉదయం పరీక్షకు 7 వేల 301 మంది అభ్యర్థులు, సాయంత్రం పరీక్షకు 7 వేల 293 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు,షూ లు అనుమతించడం జరుగలేదని తెలిపారు.అభ్యర్థుల సౌకర్యార్థం త్రాగునీరు,నిరంతర విద్యుత్ సరఫరా, రవాణా ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించి ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్.షీట్లను రక్షణ చర్యల మధ్య తరలించడం జరిగిందని తెలిపారు.