రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 18:గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో సోమవారం బోడుప్పల్ లోని సిద్దార్థ పబ్లిక్ స్కూలు, ఉప్పల్ డిపో లోని ఒమేగా మహిళా డిగ్రీ కాలేజ్ లలో పరీక్ష నిర్వహణను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, జిరాక్స్ షాపులు మూసి ఉన్నాయా, అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.