గురు పూజోత్సవం

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి

మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 5:
ఉపాధ్యాయుల ప్రాముఖ్యత విద్యార్థులకే కాకుండా, అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే గురు పూజోత్సవాన్ని జరుపుకుంటారని, విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండేలా ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో వ్యవహారించాలని మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తెలిపారు.
గురువారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గౌతం విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి, డా.సర్వేపల్లిరాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి వారికి నచ్చిన ఉపాధ్యాయులను రోల్ మోడల్ గా భావించి వారి భాష, ఆహార్యాన్ని, నడవడికను అనుసరిస్తూ ఉంటారని, అందుకే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండేలా వ్యవహారించాలని కలెక్టర్ అన్నారు. గురువు యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియజేయడానికే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటా మన్నారు. ఉపాధ్యాయ వృత్తి మీద సమాజం ఆధారపడి ఉంటుందని, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దితేనే సమాజం బాగుంటుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయుల ద్వారా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, మీరు ఇచ్చే ఫలితాలు ర్యాంకులతోనే మార్కులతోనో కాకుండా వారి జీవితాలను మౌల్డ్ చేసేలా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అందించే అవార్డులు కొలమానం కాదని, టీచర్లందరు ఉత్సాహాంగా విధులు నిర్వహిస్తూ పిల్లలను ఇన్ స్పైర్ చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ముందుగా అందరికి గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికాగుప్తా మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్ యొక్క ప్రధాన మైన పాత్ర ఉంటుందన్నారు. అత్యంత గౌరవ ప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అదనపు కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయ కుమారి జిల్లా కలెక్టర్ కు, అదనపు కలెక్టరుకు జ్ఞాపికను అందజేసారు.
ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను మెమోంటోతో కలెక్టర్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking