జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 25
జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.
పెద్ద జయంతి సందర్భంగా మండలం అర్థమండలం హనుమాన్ మాల ధరించి నిష్ఠ నియమాలతో స్వామివారికి పూజిస్తారు స్వాములు.హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు.శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ డీజే పాటలు మేల తాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్న.ఈ కార్యక్రమంలో గురు స్వాములు గుండెకారి మధు, శంకర్, శ్రీనివాస్, హరీష్, శివ, వీరేశం, సురేష్,నరేశ్ తో పాటు హనుమాన్ మాలదరణ సాములు,భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.