మెదక్ తూప్రాన్
జూన్ 21 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్,ఎండి యాసిన్ , సతీష్ చారి, శ్రీనివాస్ రెడ్డి,సుగుణాల నారాయణ చారి , రామచంద్రం
మన్నే శ్రీనివాస్ ఎండి యాసీన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర గొప్పదని కొనియాడారు.
జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.