ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను స్థానిక విశ్రాంతి భవనంలో ఘనంగా నిర్వహించారు.శనివారం ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎస్సై లక్ష్మణ్ పాల్గొని ఫోటోగ్రాఫర్ల తో కలసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ…ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటో గ్రఫీకి విడదీయలేని బంధం ఉందన్నారు.వెయ్యి మాటలు చెప్పలేని భావాలను ఒక్క ఫోటోతో చెప్పవచ్చని,అలాంటి అద్భుత కళ ఫోటోగ్రఫీ అని కొనియాడారు.ఫోటోగ్రాఫర్స్‌ తమ వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పురోభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం రిటైర్డు సీనియర్ ఫోటో గ్రాఫర్ మామిడి రవి ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పు శ్రీనివాస్, ఫోటో గ్రాఫర్స్ భాను, మధుచారి,కుడెల్లి వరుణ్ ప్రవీణ్,అనిల్,వినిత్,బమేష్, కమల్,వెంకటేష్,శ్రీను,రాంబాబు, కిరణ్,తిరుపతి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking