ఆస్తికోసం అత్త మామ వేధింపులు

-విలేకరులను ఆశ్రయించిన మహిళ

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 28

ఇల్లందకుంట మండలం గడ్డివాని పల్లె గ్రామానికి చెందిన గడ్డి జ్యోతి శ్రీనివాస్ దంపతులు తమ అత్త మామ కుటుంబ సభ్యులు ఆస్తికోసం వేధింపులకు గురి చేస్తున్నారని జ్యోతి విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే గడ్డివానిపల్లె
గ్రామానికి చెందిన గడ్డి రాములకు ఇద్దరు మగసంతానం ఒకరు ఆడబిడ్డ పెద్ద కుమారుడైన గడ్డి జ్యోతి శ్రీనివాస్ దంపతులకు ఒక కుమారుడు కూతురుఉన్నారు. గడ్డి జ్యోతి శ్రీనివాస్ కుమారుడు గత 16 నెలల కిందట ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో చనిపోయాడు అదే బాధలో కుటుంబ సభ్యులు ఉండగా కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం ఉంటే బాధనుండి తేరుకోక ముందే అత్త మామ కుటుంబ సభ్యులు నీకు కుమారుడే లేడు ఆస్తి ఎందుకని అనేక రకాలుగా గురి చేస్తున్నారని వారు ఆపోయారు. అప్పటినుండి గడ్డి జ్యోతి కుమారుడు చనిపోయిన పుట్టడు దుఃఖంలో ఉండగా, ఇదే అదునుగా భావించిన జ్యోతి అత్తమామ, కుటుంబ సభ్యులు ఆస్తికోసం తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్టు మీడియాకు తెలిపింది. తన అత్త మామకు భత్యం కింద ఉమ్మడి ఆస్తిలో నుండి రెండు ఎకరాల భూమి గతంలోనే కేటాయించామని, తన పోషణ కోసం నెలకు రెండు వేల బత్యం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా తనను తీవ్రంగా వేధిస్తున్నారని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking