హిట్టా పట్టా ! ? కల్కి సినిమా పై ఆచార్య రాఘవేంద్ర జోశ్యం నిజం కానుందా ?

ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మించి విడుదల చెయ్యబోతున్న కల్కి సినిమా యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం ఎవరిది?

గడచినా 9 మాసాలుగా రాకెట్ లా దూసుకుపోతూ పెరిగిన బంగారం యొక్క భవిషత్తు ఎలా ఉండబోతుంది ? వంటి ఆసక్తి కరమైన అంశాల గురించి ప్రముఖ వాస్తు జ్యోతీష పండితులు ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు

ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి తన జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించి 100 % ఖశ్చితమై ఫలితాలను ముందే చెప్పి ఆశ్చర్య పరచిన ఆచార్య రాఘవేంద్ర ఈ సారి మరో సంచనాలకు నాంది పలుకుతూ పలు అంశాలపై జోశ్యం చెబుతూ ఎంతో ప్రతిష్టాత్మకం గా పలువురు భారీ తారాగణం తో నిర్మించబడి విడుదల కాబోతున్న ప్రభాస్ యొక్క కల్కి సినిమా అత్యంత అద్భుతమైన రీతిలో సినిమా ప్రియుల అభిమానాన్ని చూరగొంటూ విజయాన్ని సాధించబోతుందని,మరియు ఈ సినిమా కు మాత్రమే కాకుండా ఇందులో పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయని ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు.అయితే ఈ కల్కి సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించినా ఆర్ధికంగా మాత్రం నిర్మాతలకు అంతంత లాభాలు మాత్రమే వస్తాయని వారు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేక పోవచ్చని చెప్పారు.

అలాగే ప్రస్తుతం అమెరికా లో ఎంతో ప్రతిష్ఠాత్మకం గా సాగుతున్న అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవనున్నారని,ఆతర్వాత అక్కడ నివసించే మరియు అక్కడ ఉన్నత చదువు నిమ్మిత్తం వెళ్లాలనుకునే భారతీయులకి అనుకూలమైన అనేక విధాన పరమైన నిర్ణయాలను తీసుకోనున్నారని ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు.

అంతే కాకుండా గత 9 నెలలు గా దిన దిన పరమార్ధం గా పెరుగుతున్న బంగారం ధరలు కూడా ఒక్కసారిగా 27 జూన్ 2024 నుండి అమాంతం తగ్గి పోతాయని, ఈ విధం గా రేట్లు తగ్గిపోవడమనేది దాదాపు 10 % లేదా అంతకి మించి ఉండే అవకాశం ఉందని ప్రముఖ వాస్తు జోతీష్య పండితులైన ఆచార్య రాఘవేంద్ర జోశ్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking