మొదట విడతలో ఇళ్లు…!రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తాం..!!

 

కూసుమంచి మండల పర్యటనలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం ప్రతినిధి జూన్ 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి అర్హులైన పేదలందరికీ మొదటి విడతలో ఇళ్లు రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా నాయకన్ గూడెం, భగత్ వీడు తండా, మంగళి తండా, ఈశ్వర మదారం, రాజుపేట బజార్, రాజు పేట, గోరిలపాడు తండా, హిరామాన్ తండా, పెరిక సింగారం, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, మల్లేపల్లి, గట్టు సింగారం, గంగబండ తండా, లింగారం తండా, కోక్యా తండా, లోక్యా తండా, నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి గ్రామాలను సందర్శించారు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఇన్ని సంవత్సరాల్లో ఏ సభ్యుడికి రాని మెజారిటీ రఘురాం రెడ్డి కి వచ్చిందన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్ని పరిష్కరిస్తానన్ని హామీ ఇచ్చారు. గడిచిన పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేషన్ కార్డు,ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలేరు తన సొంత ఇళ్లు కాబట్టి అక్కడి ప్రజలు ఇచ్చిన పదవితో వారందరి కోరికలు తీరుస్తానన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లోపే పాలేరులోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ తీపి కబురు అందుతుందని తెలిపారు ఉచిత కరెంటు కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి వాటిలో పేదలకు ఇళ్ళు నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి తో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking