డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుని కలిసి వినతి పత్రం అందజేసిన ఐ కె పి రిసోర్స్ పర్సన్స్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

శ్రీహరి రావు ని నిర్మల్ క్యాంపు కాయాలయం లో శనివారం పట్టణ పేదరిక నిర్మూలన(ఎం ఈ పి ఎం ఏ)
పరిధిలో (రిసోర్స్ పర్సన్) గా పనిచేస్తున్న ఆర్.పి లు కలిశారు.ఈ సందర్భంగా వారు గత ప్రభుత్వం 16.01.2018 నుండి నెలకు రూ. 4,000/-లు గౌరవ వేతనం చెల్లించారని,ఇట్టి వేతనం మేము చేస్తున్న పనికి సమర్ధవంతంగా లేదని ,మా యొక్క కుటుంబ ఆర్థిక భారం పెరిగిపోతున్నది. గత ప్రభుత్వంలో ఆర్.సి లకు న్యాయం జరగలేదు మరియు మాకు గత 7 నెలల నుండి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు. కావున మా యందు దయవుంచి మాకు రావాల్సిన 7 నెలల వేతనాలు మరియు ఇకనుండి వేతనం రూ.18,000/- లు ఇవ్వగలరని కోరారు..
తేది :13.09.2007 నుండి (ఎం ఈ పి ఎం ఏ)ఆర్.పిలు పనిచేస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వము గుర్తించకపోగా,వెట్టి చాకిరి చేయిస్తున్నారని,ఒక సమయ పాలన లేదనీ,ప్రభుత్వము చేపట్టే అన్నీ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కీలక పాత్ర పోషించే వారికి న్యాయము చేయలని విన్నవించారు.
పట్టణ పేదరిక మహిళల్లో ఆర్థిక స్వాలంభనకు కృషిచేస్తున్న ఆర్.పి.లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు.. కానీ అధికారులు రూపొందించిన జి.ఓ. 164 లో కొన్ని నిబంధనల కారణంగా ఆర్.పి.లుగా చాలా నష్టపితున్నామని అన్నారు.ఇబ్బందులు పడుచున్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎం ఈ పి ఎం ఏ) పరిధిలో పనిచేస్తున్న వారికి న్యాయం చేసి వారిని ఆదుకోవాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking