లింగారెడ్డిపేట గ్రామంలో రామ భజనతో శ్రీరాముని అక్షింతలు పంపిణీ. ఇంటి వద్ద మంగళ హారతి తో స్వాగతం.

మెదక్ మనోహరాబాద్ జనవరి 13 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగరెడ్డిపేట్ గ్రామంలో స్థానిక దేవాలయం వద్ద అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి శ్రీ రాములవారి అయోధ్య అక్షింతలు కలుశానికి పూజలు నిర్వహించి
శ్రీరామ జయరామ రామ భజన తో
ప్రతి ఇంటికి అయోధ్య రాముడి అక్షింతలను గడపగడపకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో వితరణ చేశారు.
అక్షింతల కలశానికి ప్రతి ఇంటి వద్ద మంగళ హారతితో స్వాగతం పలికారు.
హిందువుల చిరకాల స్వప్నం రామ జన్మభూమి అయోధ్యలో రాముని ఆలయం ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషంగా ఉందని , అయోధ్య రాముని అక్షింతలు ప్రతి ఇంటికి అందడం అదృష్టమని పూర్వజన్మ సుకృతమని నాయకులు
వెంకట్ చారి అన్నారు.
ఈనెల 22న అయోధ్యలో రాముని యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంటిలో 5 దీపాలు వెలిగించాలని
లింగరెడ్డిపేట్ గ్రామ శ్రీరామ భక్త బృందం సభ్యులు అన్నారు.
ఈ కార్యక్రమంలో
ప్రభాకర్ గుప్తా, వెంకట్ చారి, మణికంఠ , సురేందర్ రెడ్డి, విజయ్, సురేష్ గౌడ్, చింటూ, వెంకటేష్ , రమేష్, ,మహిళలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు , రామభక్తులు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking