ఖమ్మం ప్రతినిధి జనవరి 07 (ప్రజాబలం) అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అఖిలభారత యాదవ మహాసభ క్యాలెండర్ ను ఖమ్మం జిల్లా
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందని, యాదవులకు జనాభా ప్రాతిపదికన రాజకీయ పరంగా నష్టం జరుగుతూ ఉందని, మన ఐక్యతతో ప్రభుత్వాలకు పార్టీలకు మన సత్తా చూపించాల్సిన అవసరం ఉందని తీర్మానం చేశారని, దానికి అనుగుణంగా జిల్లాల వ్యాప్తంగా తెలంగాణలోఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మన ఖమ్మం జిల్లాలో కూడా భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉందని తెలిపారు వక్తలు మాట్లాడుతూ యాదవులకు, యాదవుల సమస్యలపై గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని, లేనిపక్షంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవులంతా ఏకత్రాటి పై నిలిచి పార్టీలు వర్గాలకతీతంగా, ఉద్యమించాల్సిన అవసరం ఉందని, తక్షణమే ఎన్సీడీసీ పథకాన్ని పునరుద్ధరించాలని ఎన్ఎల్ఎం పథకంలో బ్యాంక్ గ్యారంటీ లేకుండా మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల పెంపకం దారులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుబాకుల శ్రీనివాస్ చేతుల నాగేశ్వరరావు, బొల్లి కొమరయ్య కనక బండి విజయలక్ష్మి , తొడేటి లింగరాజు మేకల నాగేశ్వరరావు మొరి మేకల కోటయ్య, సత్తి వెంకన్న బండార్ ప్రభాకర్, మలుపుల గణేష్ ఫంకు మురళి, రాగం కోటేష్, తుప్పతి రవికుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు