-పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
-రైతులకు సేవ చేయడంలో సొసైటీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
-ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఓపెన్.
-తీరనున్న వాహనదారుల కష్టాలు.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 8
రైతులకు,వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్,డీజిల్ అందించడంలో సొసైటీలు ఉపయోగపడతాయని హుజురాబాద్ ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి అన్నారు.జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామములో నూతనంగా పెట్రోల్ బంక్ ను ఆయన ప్రారంభించారు.పెట్రోల్ బంక్ తో పాటు ఏటీఎం,
ఆయిల్ చేంజ్ 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకువచ్చామని,రైతులు వాహనదారుల దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు.అనంతరం సొసైటీ చైర్మెన్ పొనగంటి సంపత్ మాట్లాడుతూ 2108 లో డీజిల్ బంక్ గా ఏర్పడ్డ ఈ బంక్ అనధికాలంలోనే నాణ్యమైన డీజిల్ అందించి ప్రజల మన్ననలను పొందిందని,
రైతుల,వాహనదారులు, ఈ ప్రాంత ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు పెట్రోల్ బంక్ ను కూడా ప్రారంభించుకున్నామని,దీనికి సంఘం సభ్యులు,ప్రజలు సహకరించారని అన్నారు.
సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజల సహకారం మరువలేనిదని అందరి సహకారంతో ప్రారంభమైన ఈ బంక్ మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు,
సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్,వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,సొసైటీ సీఈఓ రవి,
డైరెక్టర్లు,మాజీ సర్పంచులు,
సొసైటీ మాజీ సీఈవో ప్రకాష్ రెడ్డి,ఉమ్మడి కరీంనగర్,
వరంగల్ కోపరేటివ్ మోటివేటర్ పొనగంటి రాజయ్య,
నాయకులు,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.