గోవిందరాజుల గుట్ట సన్నిధిలో శోభాయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 20:
అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమమును పురస్కరించుకొనీ గోవిందరాజస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ వరయోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో తోటి అర్చకులు అభయ ఆంజనేయస్వామి అభివృద్ధి దాతల తో కలిసి సోమవారం శ్రీరాముని శోభ యాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలకు గోవిందరాజస్వామి ఉత్సవమూర్తుల ఆలయం, గోశాల నుండి ప్రారంభమై స్టేషన్ రోడ్డు మీదుగా హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆకారపు గుడి వరంగల్ చౌరస్తా మీదుగా జేపీ ఎన్ రోడ్ నుండి దుర్గేశ్వర స్వామి గుడి మీదుగా పిన్నవారి స్ట్రీట్ , ఎల్లం బజార్, లక్ష్మీ టాకీస్ , రాముల వారి వీధి , కొత్త బొడ్రాయి మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవ మూర్తి ఆలయం వరకు శోభాయాత్ర జరుగుతుందని అన్నారు.అనంతరం గోవిందాద్రి గోశాల యందు అఖండ రామ జ్యోతి ప్రజ్వలన, అఖండ దీపోత్సవం మొదలైన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నందున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గోడపత్రిక ఆవిష్కరణలో వారియోగుల లక్ష్మణస్వామి , వరయోగుల క్రాంతి కుమార్ స్వామి మరియు వరయోగుల కృష్ణమూర్తి స్వామి, స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి ప్రదాత మరి పెళ్లి సంజీవరావు,
భక్తులు రాపాక ఉపేందర్ , బండా శ్రీనివాస్, పూర్ణచంద్ర చౌదరి, బందెల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking