ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తెలంగాణను ముంచుతుంది 

 

అభివృద్ధి కావాలంటే బిఅర్ ఎస్, అంధకారం కావాలంటే కాంగ్రెస్:
వరంగల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి నవంబర్28:

ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, కరెంటు కోతలు, ఆకలి చావులు, ఎన్కౌంటర్లు నిర్బంధాలని అలాంటి దుష్ట పాలన రాజ్యం తెలంగాణ ప్రజలకు అవసరమా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గల బారాస ఎమ్మెల్యే అభ్యర్థులు నన్నపనేని నరేందర్, దాస్యం వినయ భాస్కర్ అధ్యక్షతన రెండు నియోజకవర్గాల పరిధిలోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చివరి రోజైన ముగింపు సభ ఓరుగల్లులో నిర్వహించడం జరిగిందని వరంగల్ నగరం తనకు సెంటిమెంటు నగరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి గా పోరుగడ్డ వరంగల్ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రొఫెసర్ జయశంకర్, కాళోజి నారాయణరావు, ల తో కలిసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర అభివృద్ధి కొనసాగించేందుకు మూడోసారి బారాస ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరుతుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారని ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలని ప్రజలు అడుగుతున్నారని నాటి చీకటి రోజులు నేడు మనకు అవసరమా అని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మే అధికారంలో ఉన్నదని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించిందని, అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలుసని అన్నారు. 200 రూపాయల వృద్ధాప్య పింఛను ఇచ్చేవారని అలాంటిది స్వరాష్ట్రంలో వితంతువులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు 2000 పింఛన్లు అందించిన చరిత్ర బారాస ప్రభుత్వానిదని మూడవ దాఫాలు 5వేల వరకు పెంచుతామని అన్నారు. ఆడపిల్ల భారం కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు ఆడపిల్లల తల్లిదండ్రులకు అందించడమే కాకుండా, పెళ్లయిన దంపతులకు ఆడపిల్ల పుడితే 13000, మగపిల్లడు పుడితే 12000 తోపాటు కేసీఆర్ కిట్టు ఇచ్చి ఆడబిడ్డలను సగర్వంగా వాటి ఇంటి వద్ద వాహనాల్లో దించుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఉన్నాయా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం బారాస ప్రభుత్వంలో అన్ని రంగాలలో దూసుకుపోతుందని ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్, బిజెపిలు చూస్తున్నాయని తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు.ఎన్నికలు రాగానే అన్ని రాజకీయ పార్టీల నుండి అభ్యర్థులు పోటీలో దిగుతారని అయా పార్టీల చరిత్రను తెలంగాణ ప్రజలు గమనించి ఓట్లు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేల పనితీరు మీకు కనిపిస్తుందని రెండు నియోజకవర్గాలను అభివృద్ధి పరిచి చూపించారని వారిని మళ్లీ ఆశీర్వదించి అసెంబ్లీలకు పంపాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రజలతో మమేకమై ఉంటాడని ఎప్పుడు హైదరాబాదులో ఉన్న హనుమకొండకే పరుగులు పెట్టుకుంటూ వస్తాడని ఆయనకు నియోజకవర్గ ప్రజలు అంటే అంత ఇష్టమని అన్నారు. కార్మికుల పక్షాన నిలబడుతూ ఆటో కార్మికులకు అండగా నిలబడుతూ త్రిచక్ర సొసైటీ తో వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడని ఆటో కార్మికులకు ఏదైనా చేయాలని అంటున్నాడని ఆటో కార్మికులు చెల్లించే ట్యాక్సీలను ఎన్నికల అనంతరం రద్దు చేస్తామని అన్నారు. పశ్చిమ, తూర్పు, నియోజకవర్గం బారాస అభ్యర్థులు బిసి బిడ్డలని వారిని ఆశీర్వదించాలని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ లారీ డ్రైవర్ కొడుకుగా చిన్నస్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడని మీలో ఒక్కడిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆకాశాన్ని ముద్దు పెట్టుకునేలా బహుళ అంతస్తుల్లో అత్యదునికమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మీ కళ్ళముందే జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిజాం హయాంలో నిర్మించిన ఆజామ్ జాహి మిల్లును సర్వనాశనం చేయడమే కాకుండా అర్జున్ జాయి మిల్లు స్థలాలను రియల్ ఎస్టేట్ గా అమ్ముకున్నారని అన్నారు. వరంగల్ నగరానికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో నగరానికి కూత వేటు దూరంలో ఉన్న సంగెం మండలంలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మించుకున్నామని దాని ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఏడు గురుకులాలని జిల్లాకు ఇచ్చామని అన్నారు. దాస్యం వినయ భాస్కర్ నన్నపనేని నరేందర్లు నిధుల విషయంలో రాజీ పడకుండా కొట్లాడి మరి తెచ్చుకొని నియోజక వర్గాలను అభివృద్ధి చేసుకున్నారని బీసీ బిడ్డలుగా ఉన్న వారిని బీసీలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుచుకుంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి, బారాస నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు,మధుసూదనా చారి, పొన్నాల లక్ష్మయ్య రాకేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ రిజ్వాన షమిం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking