జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై 11:
ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు చేసిందని, గృహిణి , పాఠశాలలు, కళాశాలల స్థాయి విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదారులు ఎవరైనా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి తెలిపారు.
గురువారం రోజున అదనపు కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ గోడ పత్రికను ఆవిష్కరించారు .కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సమస్యలను పరిష్కరించే వినూత్న ఆవిష్కరణలు పంపించే అవకాశం ఇంటింటా ఇన్నోవేటర్ కల్పిస్తుందని తెలిపారు.వినూత్న ఆవిష్కరణలు దరఖాస్థు చేసుకోవడానికి చివరి తేదీ 3 ఆగష్టు 2024 అన్నారు.
ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు చేసిందని,గృహిణి నుంచి పాఠశాలలు, కళ్లాశాలలు స్థాయి విద్యార్థులు , విద్యావేతలు , వ్యవసాయదారులు ఇలా ఎవ్వరైన ఇందులో పాల్గొనవచ్చుని అయన
తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విధానం :–
* పేరు , వయస్సు , ఫోటో , వృత్తి , చిరునామా , మండలం , జిల్లా .
* ఆవిష్కరణ పేరు
* ఆవిష్కరణ వివరిస్తూ 100 పదాలలో రాసి పంపండి .
* ఆవిష్కరణ యొక్క 4 ఫోటోలు.
* ఆవిష్కరణ వీడియో 2 నిమిషాలు .
* ఫైన చెప్పిన వివరాలు అన్నియు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వాట్సాప్ నెంబర్ 9100678543 కు ఆగష్టు 3వ తేదీ 2024. లోపు పంపించాలని పేరుకొన్నారు .
* ఆగష్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఆవిష్కరణల ప్రదర్శన ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి సాంబశివరావు,డి పి .ఓ వెంకయ్య, వ్యవసాయ అధికారి రేఖ మేరీ ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు