అంతర్ జిల్లాల న్యాయవాదుల క్రికెట్ పోటీలు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజాబలం) ఖమ్మం తాళ్ళురి సాహస్ చౌదరి (బంటి) మెమారియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల వాల్ పోస్టర్ ను గురువారం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్.జగ్జీవన్ కుమార్ ఆవిష్కరించారు. తాళ్ళురి సాహస్ చౌదరి (బంటి) మెమారియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల న్యాయవాదుల గ్రేజ్ బాల్ డే & నైట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నా లని , ఈ పోటీ లు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో అక్టోబర్ 6,7,8 తేదీ లలో జరగనున్నాయని, అంతర్ జిల్లా న్యాయవాదులకు వసతి సదుపాయం ఉంటుందని ఖమ్మం జిల్లా న్యాయవాది తాళ్ళురి దిలీప్ తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు ముందుకు రావడం పట్ల నిర్వాహకుడు దిలీప్ చౌదరిని న్యాయమూర్తి అభినందించారు ఈకార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిశాల కృష్ణారావు , బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మన్నెపల్లి బసవయ్య , క్రీడల కార్యదర్శి రావుల వెంకట్, బార్ కార్యవర్గం సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking