రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 19
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు రైతులకు అందిస్తామని కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని రైతులను ఆన్ని విధాలా ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు జనవరి ఒకటి నుంచి సాగునీరు విడుదల చేస్తామని దానికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు రూపొందించారని ఈ విషయమై ఇప్పటికే అధికారులతో మాట్లాడమని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.