రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 11 ఫిబ్రవరి 2025
మణికొండ భారత రాష్ట్ర సమితి నాయకులు మరియు కార్యకర్తలు ప్రజాభిప్రాయ సేకరణ కార్య్రమంలో ఇప్పటి వరకూ సేకరించి, డివిజన్ 18 జలమండలి అధికారులకు ఇచ్చిన పిర్యాదు కాపీలను సదరు ఖైరతాబాద్ జలమండలి ఆఫీసు సందర్శించి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిని మర్యాద పూర్వకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆధ్వర్యంలో కలసి తత్ద్వార మణికొండ పురపాలక సంఘ పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్య గురించి వివరించి వారికి పార్టీ తరపున ఒక మెమొరండం సమర్పించడం జరిగింది. మెమరీండంలోని ప్రధాన అంశాలు
1. మణికొండ పురపాలక సంఘం పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా బోర్లు ఎండి పోవడం పురజనులంతా కేవలం జలమండలి సరఫరా చేసే నీటి మీద ఆధార పడటంతో, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే తగినన్ని ట్యాంకర్లు ఏర్పాటు చేయడం.
2. నెమలి నగర్ లో స్థలం కేటాయించిన చోట 0.5 ఎం.ఎల్.డి నిర్మించడం మరియు గోల్కొండ హిల్స్ కాలనీ వారు రిజర్వాయర్ నిర్మించుట కొరకు తగినంత స్థలం కేటాయించుట కొరకు ముందుకు వచ్చిన కారణంగా ఆ స్థలంలో కూడా రిజర్వాయర్ నిర్మిస్తే చుట్టు పక్కన ఉన్న కాలనీలు అన్నిటికీ మంచినీటి సదుపాయం కలుగుతుంది.
3. ప్రస్తుతం నీటి కనెక్షన్ల కొరకు అర్జీ పెట్టుకొని సాంకేతిక కారణాల వల్ల జలమండలి వారు కనెక్షన్ ఇవ్వలేని కారణంగా వారికి టెంపరరీ క్యాన్ నంబర్లు ఇవ్వాల్సిందిగా కోరడమైనది.
4. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని గేటెడ్ కమ్యూనిటీలకు డిస్ట్రిబ్యూషన్ లైన్ వేయకుండా మెయిన్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చిన కారణంగా రాబోవు కాలంలో మణికొండ నివాసస్తులు మంచినీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉంది. దీని కారణంగా డిపార్ట్మెంట్కు ఆదాయ వనరుల్లో కోతపడుతుంది కావున డిస్ట్రిబ్యూషన్ లైన్లు వేయమని మనవి.
4. పంచవటి మరియు ఇతర కాలనీలలో ఒక గంట సమయము నీటి సరఫరా చేయవలసి ఉండగా 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే మంచినీరు వస్తున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కావున పైన తెలిపిన విషయాలపై తక్షణమే స్పందించి జలమండలి వారు తగు చర్యలు తీసుకోగలరని పార్టీ తరపున అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్నాధ్ రెడ్డి, ఎర్పుల శ్రీకాంత్, సంగం శ్రీకాంత్, గోరుకొంటి విఠల్, రామసుబ్బ రెడ్డి, భాను చందర్, ఆరీఫ్ మొహమ్మద్, బొడ్డు శ్రీధర్ తది తరులు మనవి చేయడం జరిగింది.