కార్పొరేషన్ చైర్మన్ గా జంగా బాధ్యతల స్వీకరణ

హాజరైన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్,సిరిసిల్ల రాజయ్య FSC చైర్మన్. ఎమ్మెల్యే రేవూరి,
భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ పరిశ్రమల భవన్లో అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పరిశ్రమ భవన్ కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా జిల్లాలోని రైతులందరికీ న్యాయం చేశానని, అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి కూడా కృషి చేశానన్నారు. కార్పొరేషన్ పదవిని కూడా అందరికీ ఉపయోగపడేలా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తమ శాఖ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking