టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాల్గవ మసభలు జయప్రదం చేయండి.

•టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 10

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందకుంట మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు భూపతి సంతోష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికిల్ల భానుచందర్ లు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈనెల చివరి వారంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్లో జిల్లా నాల్గవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ మహాసభలకు ఫెడరేషన్ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారని ఈ మహాసభల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయాలు చేస్తామని తెలిపారు.వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్,హెల్త్ కార్డు,కరోనా టైంలో రైల్వే పాస్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని రైల్వే పాస్ ను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పునరుద్దించాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు వంద శాతం ఫీజులో రాయితీ కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎండి కాజా ఖాన్, దొడ్డే రాజేంద్రప్రసాద్,అంబాల శ్రీరామ్,శ్రీకాంత్,నవీన్,రాజు, రచ్చ రవికృష్ణ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking