జులై 6, 7న జరిగే పి డి ఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని జయప్రదం చేయండి

 

….ఎం సురేష్ పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు

సంగారెడ్డి జులై 03 ప్రజ బలం ప్రతినిది:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక టి పి టి ఎఫ్ ఆఫీస్ ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈనెల 6,7న సంగారెడ్డి టి ఎన్ జి ఓ ,భవన్లో నిర్వహిస్తున్నాం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ హారగోపాల్ సార్ పిఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ సంధ్యక్క వస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూప్రాథమిక మాధ్యమిక పాఠశాలలకు కనీస, మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించలేదు. విద్యార్థులు లేరనే పేరిట 6వేల వసూళ్ళకు రద్దు చేసారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. 20 మందికి పైగా విద్యార్థులు తమ నిండు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార సరుకుగా మార్చి వేసింది.
అధికారం కొత్తగా చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నెన్నో వాగ్ధానాలు చేసింది. విద్యారంగాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. తొలి బడ్జెన్లలో 20% నిధుల్ని కేటాయించాల్సిన చోట 7.8% మాత్రమే కేటాయించింది. ఈ నిధులు పెరగాల్సిన అవసరం ఎంత ఉంది. విద్యారంగాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడంతో పాటు మొత్తం విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం ఉద్యమించాల్సిన అవసరముందని పి డి ఎస్ యు భావిస్తున్నది. ప్రయివేట్ యూనివర్సిటీలకు, కార్పొరేట్ సంస్థలకు మొత్తం విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించాలని, అంతిమంగా విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగి అందరికీ ఒకేరకమైన సమానమైన విద్య ఉండేలా పోరాడాలని పి డి ఎస్ యు విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నది. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ నాయకులు అర్జున్ సిద్ధార్థ్, జస్వంత్ ,అయాన్, సాయి, మధు, విజయలక్ష్మి మీనాక్షి హర్షిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking