ఎం.జె.పి ప్రిన్సిపాల్ గా కె. రోనాల్డ్ కిరణ్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 10 మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల,కళాశాల ప్రిన్సిపల్ (ఎఫ్ ఎ సి)గా కె.రోనాల్డ్ కిరణ్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటివరకు పనిచేసిన గౌతమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని బహదూర్పురా ఎం.జె.పి కళాశాల ప్రిన్సిపాల్ గా బదిలీపై వెళ్లారు.పదవి బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ కిరణ్ ను ఎం.జె. పి.మంచిర్యాల జిల్లా కన్వీనర్ షేరు శ్రీధర్ నియామక పత్రం అందజేసి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందజేయడానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. అలాగే ఏటీపీగా సాగర్ ను నియమించారు.ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించిన కే రోనాల్డ్ కిరణ్ ను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది స్వాగతం పలికిసన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏటీపీలు నిచ్చల,సునీత డీ డబ్ల్యూ స్వప్న,ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking