కాళేశ్వరం,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,రీజనల్ రింగ్ రోడ్ ల పై న్యాయ విచారణ చేపట్టాలి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

కాళేశ్వరం తో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఆర్ ఆర్ ఆర్ రోడ్డు నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాళేశ్వరం అవినీతి పై సీబీఐ ను ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి మాత్రమే అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రస్తుతం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన హామీలు లేవని తెలిపారు. అధికారం లోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫి చేస్తామని, ఇప్పుడు ఆ హామీని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క రైతు రుణమాఫీ యే కాకుండా నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి పై కూడా ఈ ప్రభుత్వం స్పష్టత లేదని ఏద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 412 హామీలు నెరవేర్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తానని అన్నారు. గతం లో అధికారంలోకి రాకముందు ఫార్మాసిటి ని రద్దుచేస్తామని అన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం ఫార్మాసిటి విషయంలో ద్వంద వైఖరి చూపడం సరికాదని తెలిపారు. గత ప్రభుత్వ హామీలే ఇవ్వడం చేతకాని ఈ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన హామీలకు నిధులు ఎలా సమకూరుస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. రైతు బంధు విషయంలో రైతులను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతీ సంక్షేమ పథకం అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యం రెడ్డి, సాదం అరవింద్, సరికెల గంగన్న, జమాల్,అల్లం భాస్కర్, మార గంగారెడ్డి, వీరేష్, శ్రీరామోజీ నరేష్, నారాయణ్ గౌడ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking