సర్పంచ్ అధ్యక్షతన కాళ్లకల్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం . అభివృద్ధి పనులపై సమీక్ష.

ఇంటి చుట్టుపక్కన ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశాలు.

మెదక్ మనోహరాబాద్ 23 డిసెంబర్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సాధారణ సమావేశం తెలంగాణ రాష్ట్ర సర్పంచుల పోరం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ, మహిళా భవనం పనులను పూర్తి చేసి ప్రారంభించాలని కరోనా మహమ్మారి మళ్లీ వ్యాపిస్తున్నందున కాలకల్ గ్రామ ప్రజలందరూ చాలా జాగ్రత్తలు పాటించాలని ,
మాస్కూ ధరించే విధంగా , ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్య రీత్యా తగు చర్యలు తీసుకునే విధంగా తీర్మానాలు చేశారు. తమ ఇండ్ల చుట్టుపక్కల మధ్యన పరిశరాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని పాలక వర్గ సభ్యులు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking