రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరిపే అనిల్ కుమార్ వంజరి గణేష్ నగర్ కమిటీ హల్ లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన దరఖాస్తు సెంటర్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు పొందటానికి అభయ హస్తం అప్లికేషన్ దరఖాస్తుచేసుకోవాలి అని అభయ హస్తం అప్లికేషన్ నింపి మీ గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఈ దరఖాస్తును అందజేయాల్సి ఉంటుందిని. జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత కూడా మీ మండల, గ్రామ స్థాయిలోని ప్రభుత్వ ఆఫీసులో దరఖాస్తు అందజేయవచ్చు అని అన్నారు.