ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 01(ప్రజాబలం) ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆంక్షలు విధించి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు తిరుమలాయపాలెం మండల బిజెపి సమావేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్ అధ్యక్షతన రఘునాధపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల పాలనా కాలంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రెండు లక్షల రుణమాఫీ హామీని అమలు చేయడంలో విఫలమైనప్పటికీ ముఖ్యమంత్రి మంత్రులు రైతులందరికీ మాఫీ చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం విచారకరమని 60% రైతులకు రుణమాఫీ కాలేదని బిజెపి మోసపోయిన రైతులకు అండగా నిలవాలని వారి పక్షాన పోరాడాలని నిర్ణయించిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిసాన్ రెడ్డి గారు హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారని ఆగస్టు 5వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ ప్రభుత్వం చేతలో మోసపోయిన రైతుల వివరాలను సేకరించి రాష్ట్రవ్యాప్తంగా రైతుల తరఫున ప్రత్యక్ష కార్యాచరణ ఉద్యమాన్ని చేపడతామని శ్రీధర్ రెడ్డి తెలియజేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గ్రామపంచాయతీలలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు ఆ దిశగా పనిచేయాలని సూచి గ్రామపంచాయతీలలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కెళ్ళపల్లి నరేందర్రావు పాలేరు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీను యువ మోర్చా మండల అధ్యక్షులు గంట్ల లక్మ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు ఇందురి మహేష్ బూత్ అధ్యక్షులు భిక్షం గోవర్ధన్ వినోద్ సోమన్న పాపాలల్ మధు మాల్సూర్ తదితరులు పాల్గొన్నారు