సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిఎస్పి కృష్ణయ్య

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 8 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాల నందు విద్యార్థుల కు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్యలు అన్నారు.రుద్రంపూర్ ప్రభుత్వ పాలటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.సైబర్ క్రైమ్,మానవ అక్రమ రవాణాల అంశాలపై ఏర్పాటు చేసిన ఈ సదస్సు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సైబర్ నేరాలకు గురి కాకుండా ముందుగానే గుర్తించాలని, మొబైల్ ఫోన్కు – ఈమెయిల్ కు వచ్చే మెసేజ్ ల పట్ల,ఏదయినా సోషల్ మీడియాకు సమాచారానికైనా స్పందించకుండా అప్రమంతంగా ఉండాలన్నారు.మొబైల్ ఫోన్లకు క్రెడిట్ కార్డ్ ల పరిమితి పెంచుతామని వచ్చే సందేశాలకు ఎవరు నమ్మి స్పందించవద్దన్నారు.వివిధ కంపెనీల నుంచి క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హత సాధించినట్లు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను స్వైపింగ్ చేసే సమయంలో పిన్ నెంబర్ను ఎవరికి తెలపకూడదని స్వయంగా వారే నమోదు చేసుకోవాలన్నారు.తమ క్రెడిట్/డెబిట్ కార్డులను అపరిచిత వ్యక్తులకు,సొంత వారికి సైతం ఇవ్వకూడదన్నారు.కొన్ని రకాల టార్గెట్ టాస్కులతో ఫోన్లకు చేస్తూ సైబర్ నేరగాళ్లు మెసేజ్ లను చేస్తున్నారు.నాకు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకూడదని పేర్కొన్నారు.ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అవుతూ వాటి స్క్రీన్ షాట్లను పంపి నగదు అందజేస్తామని వచ్చే పోస్టులు అవాస్తవ సందేశాలను నమ్మకూడదన్నారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ సమయంలో క్యూఆర్ కోడ్లను సరైనదిగా ఉన్నాయో లేవో సరిచేసుకుని నగదు లావాదేవీలు చేసుకోవాలన్నారు.ఏదైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ కు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.వివిధ విభాగాలుగా సైబర్ మోసగాళ్ళు ప్రజలపై గురిపెట్టె అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్లో జరిగే లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండి,సైబర్ నెరగాలకు మోసాలకు బలికావద్దన్నారు. మహిళలు,చిన్నారులు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చైల్డ్ లైన్ ఫిర్యాదుకు 1098,సైబర్ ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930,పోలీస్ సహాయం కోసం డయల్ 100 కు సమాచారం అందజేయాలన్నారు.అదేవిధంగా ప్రస్తుతం అధిక ప్రాచుర్యంలో ఉన్న కొరియర్ సర్వీసుల పట్ల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువులు ఉన్నాయో లేదో చూసిన అనంతరమే నగదును కొరియర్ సర్వీస్ ఏజెంట్లకు ఇవ్వాలని, లేని పక్షంలో మోసపోయే అవకాశాలు ఎక్కువ శాతం నమోదు అవుతున్నాయని తెలిపారు.ఆన్లైన్ వ్యాపారం చేసే సమయాల్లో నగదును పెట్టుబడిగా చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని,ఆన్లైన్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ తో పాటు కస్టమర్ కేర్ నుంచి తమకు ఫోన్ చేస్తున్నామని వివరాలు అడుగుతే ఇవ్వకూడదని డిఎస్పి సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్ మరియు కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking