నంబర్ ప్లేట్లు లేని 35 ద్విచక్ర వాహనాలు సీజ్ సీజ్ చేసిన లక్షెట్టిపేట పోలీసులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : రామగుండం కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణం నందు సీఐ నరేందర్, ఎస్సై చంద్రకుమార్ అదనపు ఎస్సై తానాజీ,సిబ్బందితో పట్టణం నందు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. బుధవారం ఈ తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, అదేవిధంగా మైనర్ నడుపుచున్నటువంటి ద్విచక్ర వాహనాలు,డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు, సైలెన్సర్ మార్చి అధిక శబ్దంతో పొల్యూషన్కు,పాల్పడున్నటువంటి వాహనాలు 35 వరకు ద్విచక్ర వాహనాలు,ఒక కారు సీజ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ…తల్లిదండ్రులు ఎవరు మహిళలకు వాహనాలు ఇవ్వకూడదని అదేవిధంగా ప్రతి ఒక్కరు నెంబర్ ప్లేట్ విధిగా ఉపయోగించాలని,మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking