న్యాయ శాఖ మంత్రి.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ కు సిద్ధం కావాలి..దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష కు సంఘీభావం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాట్లాడుతూ.
ఉద్యమాల గడ్డగా పేరొందిన నిర్మల్ గడ్డ మహేశ్వర్ రెడ్డి గారు చేపట్టిన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విజృంభిస్తోంది, గతం లో కామారెడ్డి లో ఇలాగే అక్కడి అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా జోన్ లను రూపొందిస్తే ప్రజా పోరాటంతో, రైతులందరూ ఏకమై దాన్ని రద్దు చేసే వరకు కృషి చేశామని పేర్కొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నీతివంతుడైతే సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు..
నిర్మల్ నుండి మొదలు పెడితే హైదరాబాద్ లోని గచ్చిబౌలి వరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువుల భినామీల పేర్లతో ఉన్న భూముల విలువలు పెంచుకోవడానికి మార్చిన జి.ఓ.గుట్టు భయట పెట్టమంటారా.గతం లో సోఫినగన్ లో ఇండస్ట్రియల్ జోన్ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పజెప్పాలని, సోఫినగర్ లో ఎన్ని పరిశ్రమలు తెచ్చారో, ఎందరు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారో శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. 20 సంవత్సరాలు అధికారం లో ఉండి 2 సార్లు మంత్రి గా అధికారం ఉన్నా నిర్మల్ లో చేసిన అభివృద్ధి ఏంటో, నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సేకరించిన భూములను ఆ అవసరాలకు వాడకుండా ప్రభుత్వం వేరే ఇతర వాటికి వాడితే,ఆ భూములను తిరిగి ఏ రైతు దగ్గర సేకరించామో ఆ రైతుకు తిరిగి అప్పజెప్పాలని ఆదేశించింది సుప్రీం కోర్టు అని న్యాయ శాఖ మంత్రికి తన శాఖా పరమైన విధులు కూడా గుర్తుచేయడం సిగ్గు చేటని ఏద్దేవా చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి చిత్త శుద్ధి ఉంటే సోఫీనగర్ లో కంపెనీలు పెట్టలేదు గనక తిరిగి ఆ భూములను రైతులకు ఇవ్వాలని హెచ్చరించారు. మోసపూరితంగా తక్కువ ధరకు గతం లో సోఫీనగర్ లో కొన్న భూములను కమర్షియల్ జోన్ కి కన్వర్ట్ చేసుకొని బడా కంపెనీలకు కోట్లకు అమ్ముకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సొంత గ్రామం ఏల్లపెల్లి లోని భూముల విలువలు అమాంతం పెంచేందుకు ఆ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ నుండి కమర్షియల్ రెసిడెన్స్ జోన్ గా మార్చుకొని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ప్రజలే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు , నిర్మల్ మధ్యలో వందల ఏకరాల ప్రభుత్వ భూమి ఉన్నా కూడా స్వలాభం కోసం తన సొంత గ్రామం ఎల్లపెల్లి దగ్గరే కలెక్టర్ కార్యాలయం నిర్మించుకొని నిర్మల్ జిల్లా ప్రజలు గోస పడేలా చేస్తున్నావ్, ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే దాదాపు 200 రూ చార్జి అవుతుందని, ఇవేవీ పట్టని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే కలెక్టర్ కార్యాలయం ను అక్కడ నిర్మించుకున్నారు. తన గ్రామాన్ని మున్సిపాలిటీ లో ఎందుకు కలపలేదో ప్రజలకు వివరించాలని, తన గ్రామం పచ్చగుండాలే, మంజులాపూర్, తల్వెద గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే విధంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తక్షణమే రద్దు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాoనాథ్, సాదం అరవింద్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి.సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు,తో పాటు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపు నిర్మల్ కు బండి రాక.
మాస్టర్ ప్లాన్ రద్దు పై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ వస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు, ఈ మేరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, నిర్మల్ రైతులు పెద్ద ఎత్తున రావాలని నాయకులు తెలిపారు.
గంట గంటకు క్షీణిస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి.
నిరాహార దీక్ష చేపట్టి మూడు రోజులు దాటుతున్న సంధర్బంగా నిరసించిన మహేశ్వర్ రెడ్డి కి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గంట గంటకు క్షీణిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking