జగిత్యాల డీపీఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్‌ కుమార్‌

మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ ను కలిసిన డీపీఆర్‌ఓ
జగిత్యాల, ప్రజాబలం జూన్‌ 22 జగిత్యాల జిల్లా డీపీఆర్‌ఓగా విధులు నిర్వహించిన భీమ్‌ కుమార్‌ ఇటీవల బదిలీ కావడంతో ఆయన స్థానంలో కరీంనగర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న జి. లక్ష్మణ్‌ కుమార్‌ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కవిూషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
అనంతరం ఇన్చార్జి డీపీఆర్‌ఓ లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు విూడియా మిత్రులకు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అధికారిక సమాచారాన్ని పాత్రికేయులకు చేరవేయడంలో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరును మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking