తాటి చెట్లు తీసివేసిన వ్యక్తిపై చట్ట పరమైన చర్య తీసుకుకోవాలి.

గ్రామ శాఖ గౌడ సంఘం అధ్యక్షులు సిరిసేటి ఓదెల గౌడ్.

జమ్మికుంట, ప్రజబలం ప్రతినిధి జూన్ 20

జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కల్లు తీసేవి అర్ధరాత్రి ఎవరు లేని టైం లో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసి వేసి గీతా కార్మికుల పొట్టమీద కొట్టారని విలాసాగర్ గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిసేటి ఓదెల గౌడ్ అన్నారు. బుధవారం విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసివేసిన తాటివనం సందర్శించి చలించి పోయిన ఓదెల గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తాటిచెట్లనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న గీతా కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసివేసిన సొప్పరి తిరుపతి పై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్య తీసుకోవాలని గీతా కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.ఈ సందర్భముగా ఆబ్కారీ శాఖ జమ్మికుంట సి.ఐ మాధవిలత తో ఓదెలు గౌడ్ మాట్లాడారు.సి.ఐ స్పందిస్తు తప్పకుండా తిరుపతి పై శాఖ పరమైన కటిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘము నాయకులకు గీతా కార్మికులకు హామీ ఇచ్చారు. రాష్ట వ్యాప్తంగా గీతా కార్మికుల పరిస్థి చాలా దారుణంగా ఉందని గీతా కార్మికులను పట్టించుకొనే నాధుడే లేడని ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు ఓట్లు వేసిన తరువాత మర్చి పోయారని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతి నిధులు పట్టించుకోని గీతా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీతా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘము అద్యక్షులు సిరిసెటి ఓదెలు గౌడ్ ఉపాధ్యక్షులు ముంజాల చెంద్రయ్య గౌడ్ నాయకులు అరెల్లి రవిగౌడ్ అరెల్లి అశోక్ గౌడ్ ముంజాల సదయ్యగౌడ్ ముంజాల శ్రీనివాస్ గౌడ్ గోపగోని రాజయ్య గౌడ్ ముంజాల రవిగౌడ్ గీతా కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking