ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
నిర్మల్ ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి* జిల్లా కమిటీ సభ్యులు బార్కుంట గంగారంచందుల సాయికిరణ్,జాదవ్ రమేష్* రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య పాల్గొన్నారు.
దుర్గం నూతన కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ప్రభుత్వం చెల్లించడం లేదు .2013 తర్వాత వ్యవసాయ కార్మికుల కూలీరేట్లను పెంచలేదు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కనీస వేతనం రోజు కూలి ఆరు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.గ్రామాలలో వ్యవసాయ కూలీలతో సమావేశాలు నిర్వహించి కూలిరెట్ల పెంపుదల కొరకు గ్రామాలలో పోరాటాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది.