ముకేశ్‌ గౌడ్‌ గారి జీవిత కథ

1959 నుండి 2019 వరకు

                                   
ముకేశ్‌ గౌడ్‌ గారి జన్మదినం జులై 1, 1959. ఆయన రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ముకేశ్‌ గౌడ్‌ గారు తన రాజకీయ జీవనాన్ని 1986లో జాంబాగ్‌ నుండి కార్పొరేటర్‌గా పోటీ చేసి తన సమీప తెలుగు దేశం అభ్యర్థి పై ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆయన ప్రతిభను ప్రజలు గుర్తించి, ఆయనకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు.


1989లో మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి, బం డారు దత్తాత్రేయను ఓడిoచారు. ఈ విజయంతో ఆయన తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. అయినప్పటికీ, 1994ఎన్నికల్లో పి. రామస్వామి తో    మరియు 1999 ఎన్నికల్లో ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌  తో పోటీ చేసి ఓడిపోయారు.

 

         

అయినప్పటికీ, ఆయన నిరుత్సాహపడకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.జాతీయ కాంగ్రెస్‌ ఓబీసీ అధ్యక్షులు పి.శివశంకర్‌ గారు ఓబీసీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షులుగా ఎం.ముకేశ్‌గౌడ్‌ గారిని నియమించారు.ఆ పదవికీ న్యాయం చేశారు.

             

ముకేశ్‌ గౌడ్‌ గారు తన రాజకీయ జీవితంలో పలు పదవులను చేపట్టారు. ఆయన పట్టుదలతో, 2007-2009 సంవత్సరాల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమం బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వేల్ఫేర్‌ మంత్రిగా, 2009-2014 సంవత్సరాల్లో మార్కెటింగ్‌ మరియు గిడ్డంగుల మంత్రిగా పని చేసి, తన సేవలను ప్రజలకు అందించారు.

               

ముకేశ్‌ గౌడ్‌ గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, వాటిని సమర్థవంతంగా అమలు చేశారు. వ్యాపారుల సమస్యలను పరిష్కరించడం, కార్మికుల హక్కులను కాపాడడం వంటి అంశాలలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది. ప్రజలు ఆయనను ఎంతో ఆదరించారు, ఆయన చేసిన సేవలను గౌరవించారు.

               

అయినప్పటికీ, 2019 జులై 29న కేన్సర్‌ తో పోరాడుతూ ఆయన మరణించారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి మరియు ప్రజలకు పెద్ద నష్టం. ముకేశ్‌ గౌడ్‌ గారి సేవలు, త్యాగాలు, మరియు కృషి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

           

ముకేశ్‌ గౌడ్‌ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన జన్మదినం సందర్భంగా ఈ జీవితకథను ప్రచురించడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన రాజకీయ జీవితం, చేసిన సేవలు, మరియు ప్రజలకు చేసిన మేలు స్ఫూర్తిదాయకం. ముకేశ్‌ గౌడ్‌ గారి జ్ఞాపకాలు, వారి ఆదర్శాలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయి.

 

             

Leave A Reply

Your email address will not be published.

Breaking