మాదిగ లకు 7శాతం రిజర్వేషన్ వద్దు.. 12 శాతం ఇవ్వాలి..

 

….ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ..

సంగారెడ్డి/రంగారెడ్డి జులై 5 ప్రజ బలం ప్రతినిది:
తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ లకు 7శాతం రిజర్వేషన్ సరిపోదని పెరిగిన జనాభా ధామాషా ప్రకారం 12 శాతానికి పెంచి రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.తదుపరి మాదిగ ల లక్ష్యసాదనలో భాగంగా జులై 6న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డా,పిడమర్తి.రవి పాల్గొంటున్నారని ఎంహెచ్ పిఎస్ నాయకులు,మాదిగ జెఏసి నాయకులు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking