రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 18 నవంబర్ 2024
కొన్ని పత్రికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన మణికొండ నాయకులను ఉద్దేశించి వారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేరని చెప్పడం విడ్డూరమని, గత అసెంబ్లీ ఎన్నికల ముందు పి.మల్యాద్రి నాయుడు మణికొండ మున్సిపాలిటీ బి.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి స్వయాన అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జగమెరిగిన సత్యమని, ఆయన సేవలను గుర్తించి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పార్టీ తరపున జిల్లా ఉప కార్యదర్శి పదవిని కట్టబెట్టడం అందరికి తెలిసిందే, ఇక పోతే మైనారిటీ నాయకుడు షైక్ ఆరిఫ్ గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక కౌన్సిలర్ కే.రామకృష్ణా రెడ్డితో కలిసి బి.ఆర్.ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కావున పైన తెలిపిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నది వాస్తవం. ప్రస్తుత కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్త లందరూ ఐక్యమత్యంగా ఉంటూ ముందుకు సాగుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటూ, సమస్యల విషయమై సంభందించిన అధికారులను కలుస్తూ ప్రజా స్పందనకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కార నివారణకు పాటుపడుతున్న విషయాలకు వీరిద్దరూ ఆకర్షితులై, హితులూ సన్నిహితులతో కలసి బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరడమైనైదని తెలిపినారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నను బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా పక్షాన నిలిచింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీని పలువురు నాయకులు కార్యకర్తలు వీడి ముఖ్యంగా మైనారిటీలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరుగుతున్న వాస్తవము. ఇక నిధుల లేమి గురించి గత ప్రభుత్వం సహకరించ లేదన్న నెపం మోపిన విషయమై, మణికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆదీనంలో ఉండగా ఎందుకు గడచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయాలపై చర్చించలేదు? ఇప్పటికైనా మించి పోయింది లేదు కౌన్సిల్ సమయం ముగిసే లోపు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లేవనెత్తిన ప్రశ్నలను కౌన్సిల్లో చర్చించి తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాము.
భవదీయులు
మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ కార్య కర్థలు
పి. మాల్యాద్రి నాయుడు, షేక్ ఆరీఫ్,
కార్య నిర్వాహక అధ్యక్షుడు కుంభగళ్ల ధనరాజ్.
Next Post