శ్రీ సాయి భజన మండలి సిల్వర్ జూబ్లీ (25వ) వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయండి

ముఖ్యఅతిథిగా హస్త సాముద్రిక సామ్రాట్ అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాలు

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 9 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సాయి భజన మండలి అధ్యక్షు లు గన్నవరపు నాగేశ్వరావు మాట్లాడు తూ భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం వారి స్పూర్తి తో శుక్రవారి పేట గణేష్ ఉత్సవ కమిటి వారి సహకారంతో ఏర్పడిన శ్రీ సాయి భజన మండలి , గత 15 సంవత్సరాలుగా గాంధీచౌక్ షిరిడి సాయి మందిర్ చైర్మన్ శ్రీ వేములపల్లి వెంకటేశ్వరరావు మరియు వారి కమిటీ సహకారంతో ఆదివారం డిసెంబర్ 10 న‌‌ సిల్వర్ జూబ్లీ ( 25వవార్షికోత్సవ ) కార్యక్రమాన్ని వెంకటలక్ష్మి టాకీస్ రోడ్ వాసవీ గార్డెన్ లో ఉ॥గం॥9-30ని॥లకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హస్త సాముద్రిక సామ్రాట్ , అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాలు హాజరవుతారని వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసము ఉంటుందని పేర్కొన్నారు . అనంతరం అతిధులకు మరియు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు . కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వందనపు కృష్ణారావు , జాయింట్ సెక్రటరీ చలవాదిలక్ష్మీనారాయణ , సూర విష్ణు , పెనుగొండ ఉదయభాస్కర్ , శీలం హనుమంతరావు , భూమా అభినయ్ , ఫణి, ఇచ్చాడా శ్రీధర్, ఓలేటి నగేష్ మోటమర్రి శ్రీనివాసరావు, పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking