ఖమ్మం ప్రతినిధి జనవరి 1 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి 2024 నూతన సంవత్సరo సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాయకుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ 2024 లో, ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని, గ్రామాలలో ప్రశాంత వాతావరణం తో పల్లెలు పైర్లు పచ్చగా కళకళలాడాలని, విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటకూరి భద్రయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, మాజీ సర్పంచ్ బానోత్ నరసింహ నాయక్, మాజీ ఉప సర్పంచ్, ధరావతులాలు నాయక్, మేకపోతుల మహేష్, బాదావత్ నాగరాజు, ధరావత్ అనురాధ, ధరావత్ హరిచంద్ర, గుంటుపల్లి వెంకట్రావు, రాయల నాగ శంకర్, రాయల వెంకన్న, ధరాత రవి తదితరులు పాల్గొన్నారు.