అభినందనలు తెలిపిన ముఖ్య సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు
గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 13 జనవరి 2025
స్వామి వివేకానంద 162 జయంతి సందర్భముగా నిన్నటి రోజు ఆదివారం 12 జనవరి 2025 న లైట్ అండ్ లైఫ్ యూత్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో జడ్.పీ.హెచ్. స్కూల్ గట్టుప్పల్, నల్లగొండ జిల్లా ఆవరణలో ఉదయం 9 నుండి మొదలుకొని అవసరం మేరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాత్రి వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడల టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొనగా, న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మెంటన్ ప్రధాన కార్యదర్శి రమణ, వీరభద్ర రావు, కర్నాటి వెంకటేశ్, డోర్నాల వినయ్ కుమార్, భీమగాని సుభాష్, కొంగరి మల్లికార్జున్, ఇడం విజయ్ కుమార్, నెలాంటి రాజుల నిర్ణయం మేరకు మొదటి స్థానం కరీం నగర్ బాల్ బ్యాడ్మింటన్ కైవసం చేసుకునీ 10116/- ప్రైజ్ మనీ పొందగా, మణికొండ బాల్ బ్యాడ్మింటన్ ద్వితీయ స్థానం కైవసం చేసుకునీ 5116/- ప్రైజ్ మనీ పొందినదని, మూడవ స్థానంలో బీ హెచ్ ఈ ఎల్ బాల్ బ్యాడ్మింటన్ కైవసం చేసుకునీ 3116/- ప్రైజ్ మనీ పొందగా మొత్తం టోర్నమెంట్లో అత్యుత్తమ క్రీడాకారునిగా మణికొండ బాల్ బ్యాడ్మింటన్ నుండి గోపి సాధించడం గర్వకారణంగా ఉన్నదని ముఖ్య సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు అభినందనలు తెలియ చేశారు. కలసి కట్టుగా ఘనత సాధించిన కెప్టెన్ గా శ్రీనివాసరావునీ, జట్టు సభ్యులు రమేషు, గోపి, ప్రశాంత్, నవీన్, హసీం, సీతారామరాజు, హరినాద్ రెడ్డి, రామ్ రెడ్డి మరియు శశిధర్ లను ఆటల పోటీలో ప్రస్తుతం సాధించిన విజయానికి అభినందిస్తు మున్ముందు ఇంకా ఎన్నో ఘన విజయాలను సాధించాలని ప్రోత్సహించడం జరిగినది.