నిషేధిత ఆల్ప్రజోలం డ్రగ్ తయారీ (04)-యూనిట్లపై జిల్లా పోలీసుల దాడులు.

 

 70 లక్షల విలువ గల ఆల్ప్రజోలం డ్రగ్ తయారీ ముడిపదార్థాలు, రెండు డిస్టిలేషన్ యూనిట్‌లు 2-కార్లు సీజ్.

..జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్.

సంగారెడ్డి డిసెంబర్ 27 ప్రజ బలం ప్రతినిది: టీఎస్ నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఫసల్‌వాడి గ్రామం శివార్లలో (04) నిషేధిత ఆల్ప్రజోలం తయారీ యూనిట్‌లను గుర్తించి, సుమారు 70 లక్షల విలువైన ముడిపదార్థాలు మరియు రెండు డిస్టిలేషన్ యూనిట్‌లను, నేరస్తులు వినియోగించిన మొబైల్ ఫోన్ లను, ఒక TS 03 FA6676 SUV 500 వాహనం, TS 15FG 5554 మారుతీఎర్టిగా కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు:
1) కమల బ్రహ్మానందగౌడ్ తండ్రి మల్లయ్యగౌడ్ వయస్సు:46 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం & రియల్ ఎస్టేట్, కులం: గౌడ్స్, గ్రామం: బృందావన్ కాలనీ, ఇస్మాయిల్ ఖాన్ పేట, సంగారెడ్డి జిల్లా.
2) చిరుగోరి డేవిడ్ తండ్రి చిరుగోరి జడ్సన్ వయస్సు:59 సంవత్సరాలు, వృత్తి: రసాయన శాస్త్రవేత్త కులం : క్రిస్టియన్, విద్యార్హతలు: BSC కెమిస్ట్రీ, గ్రామం: 11-36 శాంతి నగర్ పటాన్ చెరు, సంగారెడ్డి జిల్లా.
3) కొండాపురం శివ తండ్రి లక్ష్మన్న, వయస్సు: 28 సంవత్సరాలు, కులం; ముధిరాజ్, వృత్తి: ఫార్మా కంపెనీ ఉద్యోగి, (సింథోకెమ్ ల్యాబ్స్), విద్యార్హత: MSC కెమిస్ట్రీ, గ్రామం: 1-60 రాయపోల్, జహీరాబాద్ మండలం సంగారెడ్డి జిల్లా.
4)వినోద్ కుమార్ సకినాల @ వినయ్ తండ్రి లక్ష్మయ్య, వయస్సు : 36 సంవత్సరాలు, వృత్తి: పాన్ షాప్, HPR దాభా, గ్రామం: -3-29, ఫసల్ వాది, సంగారెడ్డి మండల్,TS – 502995.

స్వాధీనం చేసుకున్న ఆస్తి:
1) డిస్టిలేషన్ డోమ్‌లు రెండు యూనిట్లు
2) ఆర్.బి.యఫ్. ( రౌండ్ బాటమ్ ఫ్లాస్క్)
3) పారా నైట్రో క్లోరో బెంజీన్,
4) బెంజోనిట్రిల్,
5) బెంజైల్ సైనైడ్,
6) ఇథైల్ ఎసిటేట్, డైక్లోరోమీథేన్,
7) హైడ్రాజిన్ హైడ్రేట్
8) క్లోరో ఏసీటైల్ క్లోరైడ్

కేసు వివరాలు: ఈ రోజు తేది: 27.12.2023 నాడు విశ్వసనీయ సమాచారం మేరకు A1-కమల్ బ్రహ్మానందగౌడ్, A2- చిరుగోరి డేవిడ్, A3- కొండాపురం శివ, A4- వినోద్ కుమార్ సకినాల @ వినయ్ అనే నిందితులు అక్రమంగా అల్ప్రాజోలం తయారీ యూనిట్‌ను నడుపుతున్నారనే సమాచారం మేరకు TS-NAB, సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, వారిని అదుపులోనికి తీసుకొని, పారా నైట్రో క్లోరో బెంజీన్, బెంజోనైట్రైల్, బెంజైల్ అయానైడ్, డిథైల్ అయానైడ్, డి.హైడ్రేట్ మరియు ఆల్ప్రజోలమ్ తయారీలో ఉపయోగించే డిస్టిలేషన్ యూనిట్లతో రెండు యూనిట్ల రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, కల్లులో ఉపయోగించే ఔషధం స్వాధీన పరుచుకోవడం జరిగింది. బ్రహ్మానందగౌడ్, డేవిడ్‌లు 2018 లో అండర్ ట్రయల్ నేరస్తులుగా కంది జైలులో పరిచయమై, ఇద్ధరిది ఒకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నందున అక్రమ అల్ప్రాజోలం తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకొని అప్పటినుండి ఇదే తరహాలో అక్రమంగా ఆల్‌ప్రజోలమ్‌ను తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. రెండేళ్ల క్రితం బెయిల్‌పై వచ్చిన బ్రహ్మానందగౌడ్ పటాన్‌చెరులో డేవిడ్ కుటుంబ సభ్యులకు సహాయంగా ఉన్నాడు. ఆరు నెలల క్రితం డేవిడ్ కూడా బెయిల్‌పై వచ్చి, అల్ప్రజోలం తయారీలో తమకున్న గత అనుభవంతో, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కెమిస్ట్ అయినటువంటి కొండాపురం శివ అనే వ్యక్తిని నియమించుకొని, మార్కెట్‌లో లభించే మధ్యవర్తిత్వ రసాయనాలను సేకరించి ఆల్‌ప్రాజోలమ్‌ను సింతసిస్/సంశ్లేషణ చేయడం ద్వారా ఆల్‌ప్రాజోలం తయారు చేయవచ్చని రహస్య యూనిట్‌ను ప్రారంభించారు. అదే విధంగా తమ వ్యాపారానికి సహాయం చేయడానికి, యూనిట్‌ను పర్యవేక్షించడానికి స్థానిక నివాసి అయిన వినోద్‌కుమార్‌ను నియమించుకొని, ప్లాన్ ప్రకారం సంగారెడ్డి శివారులోని ఫసల్‌వాడి గ్రామంలో ఒక ఇంటిలో మొదటి అంతస్తులో సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ ని అద్దెకు తీసుకొని, మెటీరియల్ అంతా పై ఇంటికి మార్చి, డిస్టిలేషన్ చేస్తూ ఆల్‌ప్రాజోలమ్‌ను తయారిని ప్రారంభించారని, పైన తెలిపిన భాగాలు, గత నాలుగు రోజుల నుండి డిస్టిలేషన్ ప్రక్రియలో ఉన్న రసాయానాలను, నలుగురు నిందితులను, పట్టుకుని సామాగ్రిని, వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు.

జిల్లా ప్రజలకు విజ్ఞప్తి:
ఈ మద్య కాలంలో అనేక మంది యువకులు/విద్యార్థులు డ్రగ్స్/గంజాయికి అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుంది. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక కుటుంబాలు బలి అవుతున్నాయి. కావున యువత/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి బారిన పడవద్దని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, TS-NAB, పోలీసుల విజ్ఞప్తి.
జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత, రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించిన వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీవంతు పాత్ర ఉండాలని ఎస్పీ గారు జిల్లా ప్రజలకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking