మెదక్ జిల్లా సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ (మోబిలైజేషన్) శిక్షణ కార్యక్రమం.

 

విది నిర్వహణలో అంకిత భావంతో పని చేసి
ప్రజల మన్ననలు పొందాలి
డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్
మెదక్ జనవరి 22 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా ఎస్.పి. డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారి ఆదేశానుసారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్ లో మెదక్ జిల్లా సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ (మోబిలైజేషన్) శిక్షణ లో భాగంగా జిల్లా అదనపు ఎస్.పి శ్రీ.ఎస్. మహేందర్ గారి ఆధ్వర్యంలో ఏఆర్ డి.ఎస్.పి శ్రీ.రంగ నాయక్ మరియు అడ్మిన్ ఆర్.ఐ శ్రీ.అచ్యుతరావ్ గార్ల శిక్షణలో సాయుధ దళ సిబ్బంది, అధికారులకు సాయుధ దళాల వార్షిక పునరుచ్చరణ (మోబిలైజేషన్) శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయింది. ఇందులో భాగంగా సిబ్బందికి ప్రతి రోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ మరియు పెరేడ్, మాబ్ ఆపరేషన్, ఆయుధాల శిక్షణ, నాకబంది, మరియు విఐపి, వివిఐపి, సెక్యూరిటీ మరియు ఇతర అంశాలపై శిక్షణ క్లాసులు ఆర్.ఐ లు అడ్మిన్ ఆర్.ఐ శ్రీ.అచ్యుతరావ్ గారు ,యం.టి. ఆర్.ఐ శ్రీ.నాగేశ్వర్ రావ్ గారు, ఆర్ఎస్ఐలు శ్రీ.నరేష్,శ్రీ.భవానీ కుమార్, శ్రీ.మహిపాల్ శ్రీ.సుభాష్, శ్రీ.యశ్వంత రావ్ గారు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ ఏఆర్ అధికారుల సిబ్బంది పనితీరు శ్లాఘనీయమన్నారు. ఏఆర్ సిబ్బంది ఒక్క ఏఆర్ డ్యూటీనే కాకుండా సివిల్ పోలీసులతో యుక్తంగా లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు ఆన్యువల్ మొబిలైజేషన్ లో భాగంగా ఈ ప్రాక్టీస్ విధి నిర్వహణలో భాగంగా దోహదపడుతుందన్నారు. ఆన్యువల్ మొబిలైజేషన్ లో భాగంగా ఏఆర్ సిబ్బందికి వారు రోజువారి నిర్వహించే విధుల పట్ల, తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో ఉండి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తద్వారా ప్రవర్తనలో మార్పు చెందాలని శిక్షణ ద్వారా మన జీవన విధానం మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు. శిక్షణ ద్వారా సిబ్బందికి ప్యూహాత్మక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పింపబడుతుంది. దీంతో పోలీసులు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుంది. సమీపం నుంచి ప్రత్యర్థని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, వ్యూహంగా మారి తలపడడం, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాల గురించి సిబ్బంది ఇలాంటి శిక్షణ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.అలాగే పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, సమయం దొరికినప్పుడు ఆరోగ్యం పై దృష్టి పెట్టి ప్రతిరోజు వ్యాయామం చేసుకోవాలని పోలీసులు ఆరోగ్య పరంగా దృఢంగా ఉన్నప్పుడే బాగా పని చేయగలుగుతారని ఎస్పీ గారు తెలిపారు.

అనంతరం పోలీస్ ధర్బార్ నిర్వహించి పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ సమస్యలను ఎస్.పి గారి దృష్టి కి తీసుకువచ్చారు. సిబ్బంది సమస్యలు విన్న ఎస్పీ గారు వెంటనే సంబందిత సిబ్బందికి తెలిపి సమస్య పరిష్కరించేల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు .పోలీస్ సిబ్బంది మంచిగా విది నిర్వహణ చేస్తే అవార్డ్స్, ఇవ్వడం జరుగుతుందని మరియు పోలీసులు క్రమశిక్షణ తప్పుతే దాని వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తే వారి పైన శాఖపారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking