ఏడుపాయల నుండి మెదక్ దాకా అన్నింట్లో ముందడుగు
ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి ప్రశంసనీయం
మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ మోల్సాబ్
మెదక్
కాంగ్రెస్ హయాంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆ పార్టీ మెదక్ బ్లాక్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ తెలిపారు. శనివారం నాడు ఆయన మెదక్ లో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చెందిందని, మెదక్ పూర్తిగా వెనుకబడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సభతో ముఖాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రౌత్ చొరవతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన ప్రశంసించారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు మెదక్లు తీవ్ర అన్యాయం గురి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఏడుపాయల నియోజకవర్గ అభివృద్ధి కోసం సర్వ చూపటంతో పాటు మెదక్ పట్టణంలో సుందరీ కరణ పనులు ముమ్మరంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గా అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నేతలు ములుగు రావాలని ఆయన కోరారు.