అభివృద్ధి పథంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూలై2:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కృషి చేయడం లో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ముందున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి కొనియాడారు.
మంగళవారం రోజున మేడ్చల్ జిల్లా లో జడ్పిటిసి, ఎంపీపీ పదవీకాలం ముగుస్తున్నందున జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దిలీప్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుందిన్నారు. అధికారుల కృషి ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పడ్డారని అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి కోరారు. జిల్లాలో పనిచేసిన అధికారులందరి సహాయ సహకారాలు ఉన్నందున మండల, గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో అధికారుల కృషి మరవలేదని కొనియాడారు. ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి గ్రామంలో వ్యవసాయం, రోడ్లు, వైకుంఠధామాలు, కరెంటు,నర్సరీలు, డంపింగ్ యార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. సహకరించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పత్రికా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న జడ్పిటిసి,ఎంపీపీ లను జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘనంగా శాలువా, మెమొంట్ లతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking